Date:24/04/2020
పుంగనూరు ముచ్చట్లు:
ప్రజలు, అధికారల సహకారంతో పుంగనూరులో కరోనాను కట్టడి చేయగలిగామని మున్సిపల్ కమిషనర్ కెఎల్.వర్మ తెలిపారు. శుక్రవారం ఆయన ప్రభుత్వాసుపత్రిలో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావాణాన్ని స్వయంగా పిచికారి చేసి, బ్లీచింగ్ వేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డిల సూచనలు, సలహాల మేరకు మున్సిపాలిటిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టామన్నారు. అలాగే మంత్రి సూచనలతో పట్టణంలోని పేదలకు నిత్యవసర వస్తువుల పంపిణీతో పాటు ప్రతి రోజు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో పేదలను , మున్సిపల్ కార్మికులను, పోలీసులను ఆదుకునేందుకు దాతలు ప్రతి రోజు రావడం అభినందనీయమన్నారు. ఈ సహకారం ఇలాగే కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించాలన్నారు. అలాగే రంజాన్ ఉపవాస దీక్షలను ముస్లింలు తమ ఇండ్లలోనే నిర్వహించుకోవాలని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం నిబంధనలు విధించిందని , ప్రతి ఒక్కరు పెద్దమనసుతో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
స్వర్గీయ డికె ఆదికేశవులకు ఘన నివాళులు
Tags: Corona is regulated with the cooperation of the people – Commissioner KL Verma