సామాజిక దూరంతోనే కరోనకు పరిష్కారం…. ఎమ్మెల్యే జోగు రామన్న.

Date:30/03/2020

ఆదిలాబాద్ ముచ్చట్లు:

కే.ఆర్.కే కాలనిలో మంచినీటి  అధికారులతో కలిసి పరిశీలించి, ట్యాంకుల ద్వారా నిత్యం నీటిని సరఫరా చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఇందులోభాగంగా మిషన్ భగీరథ ట్యాంక్ ను పరిశీలించి కాలనీలో నీటి ఎద్దడి రాకుండా అధికారులను అప్రమత్తం  చేయడంతో పాటు కాలనిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు,ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం రిమ్స్ ను సందర్శించిన ఎమ్మెల్యే రిమ్స్ లో మంచినీటి సమస్య రాకుండా మొన్ననే వాటర్ స్పెషల్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పడం జరిగినది. మరియు హాస్పిటల్ కు సంబంధించి కరోన కోసం ఏర్పాట్లు గురించి మాట్లాడం దీనికి సమందించి పలు అంశాలను రిమ్స్  డైరెక్టర్  బానోతూ బలిరామ్ తో చేర్చించడం జరిగింది.ముక్యంగా కారోనా వైరస్ నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అయితే రిమ్స్ లో వైరస్ కోసం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ కు సూచించారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బెడ్లను పరిశీలించి అందరూ సామాజిక దూరం పాటించాలని, రిమ్స్ కి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ కు అందరూ సహకరించాలని కోరారు.ఇందులో మున్సిపల్ ఎఇ అరుణ్ కుమార్,పలువురు అధికారులు,వార్డ్ కౌన్సిలర్లు,తదితరులు ఉన్నారు

కరోనా నియంత్రణలో తెలంగాణ బెస్ట్

Tags:Corona is the solution for social distance …. MLA Jogu Ramanna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *