కరోనా కనికరిస్తే..రూ 4 కోట్ల తో మహాశివరాత్రి బ్రహోత్సవాలు
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
కరోనా కనికరిస్తే రూ 4 కోట్ల తో మహాశివరాత్రి బ్రహోత్సవాలు నిర్వహించుతామని శ్రీకాళహస్తి ఆలయ ఇ.ఓ పెద్ది రాజు అన్నారు. శ్రీకాళహస్తిశ్వరాలయం లో నిర్వహించే ఉత్సవాల్లో మహాశివరాత్రి బ్రహోత్సవాలకు ఏంతో ప్రాముఖ్యత ఉందని, శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితి అని అన్నారు. ఈ నేపద్యంలో ఇంజనీరింగ్ విభాగం టేండర్లు ప్రక్రియ ను చేపట్టారు. యుద్ద ప్రాతిపదిక పై పనులు చేపడుతున్నారు. అయితే కరోనా కేసులు రోజు రోజుకి పెపేరుగు తుండడంతో మహాశివరాత్రి సమయం లో భక్తులను అనుమతిస్తారా, లేక ఏకాంతం గా నిర్వహిస్తారా అనేది ప్రశ్నార్థకం మారింది. ఫిబ్రవరి 24 నుంచి శ్రీకాళహస్తిశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం కావావల్సిఉంది. 13 రోజు ల పాటు నిర్వహించే బ్రహోత్సవాల్లో శివరాత్రి ముందు ఐదు రోజు ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. మార్చి 1 తేదీ మహాశివరాత్రి పర్వదినం గా ప్రకటించారు. శ్రీకాళహస్తిశ్వరాలం లో మహాశివరాత్రి బ్రహోత్సవాల్లో బాగంగా 13 రోజుల పాటు నిర్వహిస్తారు. మండపాల అలంకారానికి శ్రీకారం చుట్టారు. ఆలయ గోపురాల కు రంగులు వేయడం, కలశాల కు బంగారు పూత వేయటం జరుగుతుంది. ఆలయం అంతా విద్యుత్ బల్బులతో అలంకరణ కు సిద్దం చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Corona Kanikariste..Mahashivaratri Brahmotsavalu with Rs 4 crore