Corona vaccine released on August 3.

నేటి నుంచి మార్కెట్‌లోకి కరోనా ఔషధం

-హెటిరో ఫావివిర్‌ ధర ఎంతంటే..

Date:30/07/2020

దిల్లీ ముచ్చట్లు:

కొవిడ్‌-19 వ్యాధి చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ ఔషధాన్ని భారత్‌లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. రెమిడెవిసిర్‌కు జనరిక్‌ రూపమైన ఫావిపిరావిర్‌ను కరోనా వైరస్‌ వ్యాధి ప్రాధమిక, మధ్యస్థ దశలో ఉన్నపుడు వాడతారు. తాజా ఔషధం ఫావివిర్‌ నోటి ద్వారా తీసుకునే మాత్రల రూపంలో బుధవారం నుంచి దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు, ఫార్మసీల్లో లభ్యమవుతుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే దీనిని వైద్యుల ప్రిస్కిప్షన్ మేరకు మాత్రమే అందచేస్తామని.. ఒక మాత్ర విలువ రూ.59గా సంస్థ నిర్ణయించింది.ప్రపంచంలో కరోనా కేసుల నమోదులో మూడో స్థానంలో నిలిచిన భారత్‌లో ఈ ఔషధానికి విపరీతమైన డిమాండు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫావిపిరావిర్‌ తయారీ, పంపిణీ చేసేందుకు తమకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి లభించిందని హెటిరో తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన ఈ ఔషధ సంస్థ కోవిఫర్‌ పేరుతో ఇదివరకే రెమిడెసివిర్‌‌ ఔషధాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలకు వైద్య అనుగుణంగా తాము తయారుచేస్తామని సంస్థ అధికారులు తెలిపారు.

ఒకే చితిపై 4 మృతదేహాలు

Tags: Corona medicine on the market from today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *