Corona is reduced disturbance

కరోన నెగిటివ్ సర్టిఫికెట్ అందజేత

Date:11/08/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా రామారెడ్డి పిహెచ్ సి పరిధిలో గల పోసానిపెట్ గ్రామంలో కరోనా పాజిటివ్ గా వచ్చిన కానిస్టేబుల్ రాములు హోమ్ హైషోలేషన్ లో ఉండి విజయవంతంగా 17 రోజులు పూర్తి చేసుకొన్న సందర్భంగా అతనికి డా. షాహీద్ ఆలీ కరోనా నెగిటివ్ గా  నిర్దేశించడం జరిగింది. ఇందుకు గాను నెగిటివ్ గుర్తింపు సర్టిఫికెట్ ను డా. షాహీద్ ఆలి , ఎస్ఐ రాజు, గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి లు కలిసి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ఇన్ని రోజులు నాకు, నా కుటుంబం కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి  తగు మందులు, సూచనలు తెలిపిన డా. షాహీద్ ఆలి కి , వైద్య బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎవరికి అయిన కరోనా వ్యాధి సోకిన వారు భయపడకుండా మనోధైర్యంతో ఉండి ఎదిరించాలని, ప్రతి రోజు వైద్యులు చూపెట్టి సూచనలు పాటిస్తూ రోజు 5 సార్లు వేడి నీళ్ళు త్రాగాలని, ప్రతి సారి గరం గరం పదార్థాలు తినాలని, మాస్క్ ను ధరించి, వ్యాయాయం ఉదయం సాయంత్రం చేయాలని,  డ్రై ఫ్రూట్స్ ను మరియు మందులు టైం  తప్పకుండ వాడుతూ ఉంటే తప్పక కరోనా వ్యాధి నుండి బయటపడవచ్చు అని తెలిపారు. ముఖ్యంగా వైద్య బృందం కు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో డా. షాహీద్ ఆలి, సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఎస్ ఐ  రాజు, వైద్య సిబ్బంది మనేకర్ భీమ్ హెచ్ ఈ, దోమల శ్రీధర్, భువనేశ్వరి, రాజు, గ్రామ ఉప సర్పంచ్ , వార్డు సభ్యులు పాల్గొన్నారు.

 

 వై ఎస్ ఆర్ చేయూతకు మేము అర్హులం  కాదా ! “” కర్లపూడి గ్రామ మహిళల ఆవేదన

 

Tags:Corona Negative Certificate Presentation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *