కరోనా రోగి ఆకు కూరలు అమ్ముతోంది

మిర్యాలగూడ ముచ్చట్లు :

 

ఆమెకు వారం రోజులుగా జ్వరం వస్తోంది. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకో గా ఆమెకు కరోనా ఉన్నట్లు డాక్టర్ చెప్పాడు. క్వారంటైన్ కు వెళ్లాలని సూచించాడు. ఆమె క్వారంటైన్ కు వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయింది. అంతటితో ఆగకుండా రోజులాగే మార్కెట్ కు వెళ్లి ఆకుకూరలు అమ్మడం మొదలు పెట్టింది. అప్పటికే ఆమె వద్ద చాలామంది ఆకు కూరలు కొనుగోలు చేశారు. ఇంతలో ఆమెకు కరోనా పరీక్షలు చేసిన డాక్టర్ అక్కడికి వచ్చాడు. ఆమెను చూసి గుర్తు పట్టాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే ఆమె వద్ద ఆకు కూరలు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెప్పడం కొసమెరుపు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Corona patient selling leafy vegetables

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *