పుంగనూరులో కరోనా రోగులు నిర్భయంగా ఉండాలి – జేసి రాజశేఖర్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా భారీన పడిన వారు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండ నిర్భయంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ సంక్షేమం రాజశేఖర్‌ అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని కోవిడ్‌ ఆసుపత్రిని, కోవిడ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులను పరామర్శించి, సదుపాయాల గురించి విచారించారు. జేసి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ కోవిడ్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్ల కొరత లేదన్నారు. అన్ని రకాల వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే కోవిడ్‌ కేంద్రంలో కూడ వసతులు సంతృప్తి కరంగా ఉందన్నారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Corona patients in Punganur should be fearless – Jesse Rajasekhar‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *