పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

పుంగనూరు ముచ్చట్లు:

 

నియోజకవర్గంలో కరోనా బారీన పడి చికిత్స పొందుతున్న రోగులకు సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ పిలుపునిచ్చారు. బుధవారం కోఆఫ్షన్‌ మెంబరు పిఎల్‌.ప్రసాద్‌ ఆక్సిజన్‌ మీటర్లను విరాళంగా ఎంపికి అందజేశారు. ఎంపి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి కలసి రూ. 2 కోట్ల రూపాయలతో ప్రభుత్వాసుపత్రిలోఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. రోగుల కోసం ఇలాంటి సేవలు అందిస్తున్న పెద్దిరెడ్డి కుటుంబానికి కృత జ్ఞతలు తెలిపారు. రోగులు ఈ అవకశాలను సద్వినియోగం చేసుకోవాలని , కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ, కరోనా నియంత్రణ కోసం కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్నన్‌ నాగభూషణం, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రెడ్డికార్తీక్‌, డాక్టర్‌ కిరణ్‌, పార్టీ నాయకులు పిఎల్‌.శ్రీధర్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Corona patients should be served in Punganur-MP Reddeppa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *