Corona cases again

దేశంలో కొత్తగా 61,871 మందికి కరోనా పాజిటివ్‌

Date:18/10/2020

దిల్లీ ముచ్చట్లు:

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే క్రియాశీల కేసులతోపాటు, కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. శనివారం 9,70,173 నమూనాలను పరీక్షించగా 61,871 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1033 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,14,031గా నిలిచింది. నిన్న దేశ వ్యాప్తంగా 72,614 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 65,97,210 మంది కోలుకున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,83,311 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది.గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు రికవరీల రేటు పెరుగుతోంది. దాదాపు 88.03 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.45 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,42,24,190 నమూనాలను పరీక్షించినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇది చారిత్రాత్మకం..

Tags:Corona positive for 61,871 newcomers in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *