Natyam ad

నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్‌

అమరావతి  ముచ్చట్లు:
 
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తాను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేట్ అవుతానని వెల్లడించారు. ‘‘నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాకు కరోనా లక్షణాలేమీ లేవు. అలాగే బాగానే ఉన్నాను. కానీ నేను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటాను. నన్ను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరినీ సేఫ్‌గా ఉండాలని అర్థిస్తున్నాను’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Corona positive for Nara Lokesh