Corona positive for SP boy.

ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్. 

Date:05/08/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

నెలలు గడుస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు…! కొన్ని దేశాల్లో కేసులు వేగంగా విస్తరిస్తుంటే…మరికొన్ని దేశాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంది..! ఆర్ధిక వ్యవస్థలను కాపాడుకోవడానికి లాక్‌డౌన్ నిబంధలను సడలించడంతో చాలా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. మరో రెండు నెలల పాటు కేసులు ఊహించని స్థాయిలో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాల్లో సెలబ్రిటీలు ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే దర్శకులు రాజమౌళి, తేజ అలాగే మరి కొందరు నటులకి కరోనా సోకింది. టాలీవుడ్ నిర్మాత పోకూరి రామా రావు కరోనా బారిన పడి మరణించారు కూడా. నిన్నటికి నిన్న సింగర్ స్మితకు కరోనా సోకింది. ఇక తాజాగా లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను చెన్నైలోని చులైమెడు ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.

ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ తయారీ పూజ ప్రారంభం

Taga: Corona positive for SP boy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *