ఇలా గుంపులుగా ఉంటే కరోనా రాదా ?        

-నిబంధనలు పాటించకుండా కరోనా పరీక్షలు
-మంత్రాలయంలో నిబంధనలకు నీళ్ళు
-గుంపులుగుంపులుగా ప్రజలు. పట్టించుకోని అధికారులు, పోలీసులు

Date:16/09/2020

మంత్రాలయంముచ్చట్లు:

కరోనా పరీక్షలు చేస్తారు. కానీ నియంత్రణలు ఏవి ? నిబంధనలు ఏవి ? అధికారులు ఎక్కడ ? పోలీసులు ఎక్కడ ?  గ్రామ సచివాలయ వ్యవస్థ ఎక్కడ ?  గ్రామ వాలంటరీ వ్యవస్థ ఎక్కడ ?  ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి వస్తే నియంత్రించాల్సిన అధికారులు , పోలీసులు  చేతులెత్తేశారు. రోడ్డుపై నలుగురు కనపడితే చాలు  నానా నానా హడావిడి చేసే పోలీసులు మాస్క్ ధరించాలి ,దూరం పాటించాలి అంటూ హడావిడి చేసే పోలీసులు మంత్రాలయం సంత మార్కెట్లోకి కోవిడ్  పరీక్షల కోసం వందలాది మంది గుమికుడితే నియంత్రించకుండా  ఎక్కడికి వెళ్లారు ? మరి ఎటువంటి నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా ఉంటే కరోనా రాదా ? బుధవారం మండల కేంద్రంలోని మంత్రాలయం  సంత మార్కెట్ లో కరోనా పరీక్షలు చేయడానికి కోవిడ్ పరీక్షల బస్సు వచ్చింది. విషయం తెలుసుకున్న పాతవూరు, రామచంధ్రనగర్ ,రాఘవేంధ్రపురం,సుశమీంధ్ర కాలనీ సంతా మార్కెట్ ప్రాంతాల వాసులు ఒక్కసారిగా  పరీక్షలు చేయించుకోవడానికి సంత మార్కెట్ దాకా వచ్చారు. కానీ అక్కడ పోలీసులు ఎవరూ కనిపించలేదు నియంత్రణ లేక భౌతిక దూరం పాటించకుండా గుంపులుగుంపులుగా పరీక్షలు చేయించుకోవడానికి ఎగబడ్డారు.

 

 

చాలా మంది మాస్క్ కూడా వేసుకొని రాలేదు. అప్పటికప్పుడు చేతి గుడ్డను, చీర కొంగును మూతికి కట్టుకొని సర్దుకున్నారు. అంతేగాని భౌతిక దూరం ఏమాత్రం పాటించలేదు. రాష్ట్రంలో దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్ని నెలలు గా కంట్రోల్ గా ఉన్న ప్రజలు,కంట్రోల్ చేసిన అధికారులు ,పోలీసులు చల్లబడిపోయారు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అంటూ  వదిలేశారు.కోవిడ్ నిబంధనలకు  అధికారులు, పోలీసులు, ప్రజలు  ఎప్పుడో నీళ్ళు వదిలేశారు. ప్రజలు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా రావడం వల్ల ఎక్కడ మంత్రాలయంలో కోవిడ్ విజృంబిస్తోందేమోనని  గ్రామస్తులు భయపడిపోతున్నారు. ఒక్కొక్క కాలనీలో ఒకటి ,రెండు రోజుల చొప్పున కోవిడ్ పరీక్షలు చేసే వాహనాన్ని పెట్టేస్తే ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదు కదా ? ఊరు మొత్తానికి ఒకేసారి ఒకే చోట  పరీక్షలు  చేయడం వల్లే ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. అధికారులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో  ఏమో మరి ?

 రూ.70 లక్షల విలువైన “శ్రీ సిటీ” రెడ్‌ మీ ఫోన్లు గోవిందా!

Tags: Corona Radha if there are groups like this?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *