దేశం లో 97.22 శాతానికి పెరిగిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొంచం కొంచం తగ్గుముఖం పడుతుంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 37,154 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 724 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.22 శాతానికి పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,08,764 మంది చనిపోయారు. క‌రోనా నుంచి మ‌రో 39,649 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,00,14,713. దేశంలో ప్ర‌స్తుతం 4,50,899 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,74,376. ఇప్ప‌టి వ‌ర‌కు 37.73 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జరిగినట్లు వెల్లడించింది.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Corona recovery rate in the country increased to 97.22 percent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *