కరోనా నిబంధనలు గాలికి…. పార్క్ లో జనం మరిచిన కనీస బాధ్యతలు

తరుపతి  ముచ్చట్లు:
ఆహ్లాదకరమైన పార్కులో కారోన నిబం ధనలు యధేచ్చగా ఉల్లంఘన జరుగు తున్నాయి.తిరుపతి ప్రకాశం పార్క్ సోషల్ డిస్టెన్స్ లేకుండా మాస్కులు లేకుండా పార్క్ యజమాన్యం కరోనా నిబంధనలు అమలు చేయడంలో వైఫల్యం చెందింది. కౌంటర్ వద్ద శానిటైజర్ మాస్క్ వేసుకోకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది,  ప్రజలు పార్కు లో మాస్కులు లేకుండా తిరగడం సాధారణమయిపోయింది.  సోషల్ డిస్టెన్స్ పాయించడం లేదు.కరోనా మహమ్మారి రెండో దశలో కలకలం రేపుతోంది. చిన్న, పెద్ద వయోబేధం లేకుండా అందరిపైన వైరస్ దాడి చేస్తోంది. ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు, జనం మధ్య దూరం, తరచూ చేతులు శుభ్రం చేస్తుండడం వల్ల మహమ్మారి బారిన పడకుండా మనల్ని కొంతమేరకైనా కాపాడుకోవచ్చు. మహమ్మారి సునామీలా విరుచుకుపడుతున్నా ఈ పార్కు అధికారుల్లో కనీస బాధ్యత కనిపించడం లేదు. ఎక్కడపడితే అక్కడ ప్రజలు గుంపులుగా ఉండడం, నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి కారణంగా నిలుస్తోంది. అక్కడి పరిస్థితి చూస్తే కరోనాకు హాట్స్పాట్గా మారుతుందా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Corona rules wind up.
Minimum responsibilities that people forget in the park

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *