– ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా కమిటీ
Date:02/12/2020
నెల్లూరు ముచ్చట్లు:
కంటికి కనిపించని ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, వైద్య సేవలు అందించిన మరియు యు యు.ఎస్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం నియమించిన వైద్య సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. కామేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు అనూహ్య రీతిలో పెరుగుతున్న ఈ తరుణంలో అత్యవసర సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన వైద్య సిబ్బందిని విధుల నుండి తొలగించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ అవసరాల నిమిత్తం వారిని వెంటనే పర్మినెంట్ కేటగిరీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వారిని అదే కోణంలో దీవించాలని ప్రజా ఆరోగ్య వేదిక డిమాండ్ చేస్తుందన్నారు. ఒకప్పటి కోవిడ్ వైరస్ మన సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమని అభినందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య సంస్థ, తిరిగి అదే సిబ్బందిని విధుల నుండి తొలగించడం సమంజసం కాదన్నారు. అందులో భాగంగానే భవిష్యత్ వైద్య ఆరోగ్య అవసరాలు దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాలను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఏదేమైనా చాల్లే రాష్ట్రంలో కోవిడ్ వైరస్ వ్యాప్తిని హరి ఖండంలోనూ మరియు కోవిద్ 19 పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు సేవలందించడంలో తాత్కాలిక వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని చెప్పిన ప్రభుత్వం , సంబంధిత వైద్య సిబ్బంది అందరిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని అవసరం ఉందన్నారు. నాటి వైద్య సిబ్బంది సేవలు కారణంగానే రాష్ట్రంలో కోవిద్ 19 తగ్గుముఖం పట్టిందని , ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ దేశాల సూచనల మేరకు కోవిడ్ 19 రెండవ దశ ముమ్మరం కానున్న సమయంలో ప్రభుత్వం తాత్కాలిక వైద్య సిబ్బందిని తొలగించడం అమానుషం అన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణుల అభిప్రాయాల మేరకు, సూచనలు సలహాల మేరకు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కు గత 6 నెలలుగా అపార అనుభవం గడించి, విశ్రాంతి ఎరుగక సేవలందించిన కాంట్రాక్టు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకుని, శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సమయంలో కరోనా వైరస్ రెండవ దశను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ పట్ల సమర్థవంతమైన శిక్షణ ఇచ్చి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో రాబోవు కరోనా వైరస్ లాంటి మహమ్మద్ లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
Tags: Corona serviced, temporary medical staff should be made permanent