Corona should be attacked in solidarity

ఐకమత్యంతో కరోనాపై దాడి చేయాలి 

– పుంగనూరులో 144 సెక్షన్‌
– రోడ్లపైకి రావద్దు
-షాపులు తెరవద్దు
– అతిక్రమిస్తే క్రిమినల్‌ కేసులు
– రహదారులు బంద్‌
– కమిషనర్‌ వర్మ, సీఐ గంగిరెడ్డి హెచ్చరికలు

Date:23/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

కులమతాలకతీతంగా అన్ని వర్గాలు, ప్రాంతాల వారీగా కరోనా వైరస్‌పై ఐకమత్యంతో దాడి చేయాల్సిన అవసరం ఉందని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపాలిటిలో జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, ఎస్పీ సెం•ల్‌కుమార్‌ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటి డిఎంఅండ్‌హెచ్‌వో రాజశేఖర్‌రెడ్డి, సీఐ గంగిరెడ్డి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు హాజరైయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ , త్స్పీ పలు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో ఐసోలేషన్‌ సెంటర్లను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల ప్రజల కోసం ఈడిగపల్లె వద్ద గల ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. మున్సిపాలిటి పరిధిలో అన్ని వార్డుల్లోను పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని కమిషనర్‌ తెలిపారు. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐలకు ఇండ్లలో నివాసం లేకపోతే వారిని కూడ తక్షణం మార్చనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వ్యక్తి గత పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని, రోడ్లపైకి రావడం, ప్రయాణాలు చేయడం మంచిదికాదన్నారు. మానవాళి మనుగడకు విఘాతం కలిగిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మెడికల్‌ ఆఫీసర్‌ సోనియా, డీఈఈ రమణ, ఏఈ కృష్ణకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

144 సెక్షన్‌ అమలు…

ప్రభుత్వాదేశాల మేరకు పుంగనూరులో 144 సెక్షన్‌ను అమలు చేశామన్నారు. గుంపులుగా తిరగడం నిషేధించామని సీఐ గంగిరెడ్డి తెలిపారు. అలాగే పట్టణ సరిహద్దుల్లోని ఐదు రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను పూర్తిగా నిషేధించేందుకు సిబ్బందిని నియమించామన్నారు. అలాగే పట్టణంలో నిత్యవసర వస్తువులు, మందుల దుకాణాలు మినహా ఏ దుకాణాలను తెరవరాదని సూచించారు. అలాగే వైరస్‌పై సోషియల్‌ మీడియాలో తప్పుడు సమాచారం పెడితే కేసులు పెడతామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవ ర్తించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రెండవ రోజు కొనసాగిన జనతా కర్ఫ్యూ

Tags: Corona should be attacked in solidarity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *