Corona should be curative

కరోనా నివారణకు ఉధ్యమించాలి

– అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Date:26/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనా వ్యాధి ప్రభలకుండ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు ఉధ్యమించాల్సిన అవసరం ఉందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి , మండల ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా అవగాహన సదస్సును ఎంపీడీతో లక్ష్మీపతినాయుడు ఆధ్వర్యంలో ఈడిగపల్లె గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా భాస్కర్‌రెడ్డి హాజరైయ్యారు. ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాదిని నియంత్రించేందుకు ప్రజలు తమ ఇండ్లలోనే ఉండిపోవాలన్నారు. వ్యక్తిగత పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో కూడ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బయట వ్యక్తులతో కలవడం , తిరగడం చేయరాదన్నారు. వ్యాదిని నియంత్రించేందుకు గ్రామస్తులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరోనా నివారణలో కుబేరులెక్కడ?

Tags: Corona should be curative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *