All party meeting on Corona on the 4th

ఎమ్మెల్యేల్లో కరోనా టెన్షన్

Date:02/12/2020

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపింది. రెండు రోజులుగా సమావేశాలకు హాజరైన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంగళవారం అసెంబ్లీలో కారుమూరి ప్రసంగించారు.. పాజిటివ్ రావడంతో ఈ రోజు అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. ఈ విషయం తెలియడంతో కారుమూరితో రెండు రోజులుగా కలిసి ఉన్న ఓ ఎమ్మెల్యేకు టెన్షన్ మొదలైంది. అసెంబ్లీలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారగా.. మిగిలిన సభ్యులు కూడా భయపడుతున్నారు. ఒక్కసారిగా కరోనా భయం తలెత్తడంతో కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాలేదని తెలుస్తోంది. దీనిపై అసెంబ్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది. కారుమూరికి పాజిటివ్ అన్న వ్యాఖ్యలను ఆయన కార్యాలయం ధృవీకరించలేదు.

 ఫైజర్ టీకా రెడీ

Tags: Corona Tension in Emmelle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *