Education with the additions of change

కరోనా పరీక్షల ఫలితాలను వెంటనే వెల్లడించాలి

Date:12/07/2020

తిరుపతి ముచ్చట్లు:

మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన కరోనా ని అరికట్టడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నది .టెస్టింగ్ చేయడంలో మన రాష్ట్రం ఇండియా లోనే ప్రథమ స్థానంలో ఉన్నది . అయితే పుంగనూరులో టెస్టింగ్ చాలా ఆలస్యంగా చేస్తున్నారు . అలాగే టెస్టింగ్ తరువాత టెస్టింగ్ ఫలితము కూడా చాలా లేటుగా ఇస్తున్నారు . ఫలితంగా కరోనా ని అరికట్టడంలో ఆలస్యం అవుతుంది.మన పొరుగున ఉన్న పలమనేరు, మదనపల్లి లలో టెస్టింగ్ అయిన రోజు లేక మరుసటి రోజు టెస్టింగ్ రిజల్ట్ వస్తున్నది. పుంగనూరు లో మాత్రం దాదాపు వారం రోజులు తీసుకుంటున్నది. Testing ,tracing, treatment (T3) ఎంత వేగంగా ఉంటే అంత వేగంగా కరోనా ని కంట్రోల్ చేయగలను కావున మన మీడియా సోదరులు దయచేసి ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి టెస్టింగ్ అయిన వెంటనే టెస్టింగ్ రిజల్ట్ వచ్చేటట్లుగా చేయగలరని ఆశిస్తున్నాను. ఈ విషయం విద్యాసంబంధమైనది కాకపోయినప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీకు తెలియజేయడమైనది. అన్యధా భావించకండి.

సుంద‌రకాండ పారాయ‌ణానికి అపూర్వ స్పంద‌న‌

Tags:Corona test results should be disclosed immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *