Corona tests for 150 teachers

150 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు

Date:26/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు మండలంలోని ఉపాధ్యాయులందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఎంఈవో కేశవరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో డాక్టర్‌ రెడ్డి కార్తీక్‌ ఆధ్వర్యంలో 150 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ పట్టణము, మండలంలోని ఉపాధ్యాయులందరికి కరోనా పరీక్షలు బ్యాచ్‌లు వారిగా చేపడుతున్నట్లు తెలిపారు. నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు ప్రారంభమౌతున్న తరుణంలో జిల్లా కలె క్టర్‌ ఆదేశాల మేరకు పరీక్షలు చేపట్టామన్నారు. ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్య ఉన్న వారికి చికిత్సలు చేపట్టి, హ్గం ఐసోలేషన్‌లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీని ద్వారా కరోనాను నియంత్రిస్తూ, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ చికిత్సల్లో వైద్య సిబ్బంది మురళి, హరినాథరెడ్డి, ఆనంద్‌తో పాటుఏఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వాసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

Tags: Corona tests for 150 teachers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *