Corona tests in manneguda

మన్నెగూడాలో కరోనా పరీక్షలు

Date:30/05/2020

రంగారెడ్డి  ముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధి  మన్నెగూడా  సంపద హోమ్స్  కంటోన్మెంట్  జోన్  లో కేంద్ర ఆరోగ్య  వైద్య బృందం  ఇంటింటికి సర్వే చేసి కరోన నేపధ్యంలో రక్త నమూనాల సేకరిచింది.  కరోన మహమ్మారి విజృంభిస్తున్న  తరుణంలో దేశ వ్యాప్తంగా హాట్ స్పాట్ జోన్ లుగా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తెలంగాణ లో  హైదరాబాద్ పరిధి లో అర్బన్ ఏరియాలో ఐదు కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసారు. అందులో భాగంగానే మన్నెగూడా లో సంపద హోమ్స్ లో  గతంలో ఒక పాసిటివ్ కేసు నమోదు కావడంతో  శనివారం  ఇంటింటి సర్వే చేసారు.  ఐ సి ఎం ఆర్ ఇంచార్జ్  డాక్టర్ అభిరామ్ మాట్లాడుతూ పాపులేషన్ ఏమైనా మార్పులు వచ్చాయా అని  తెలుసు కోవడం కోసం  ఈ సర్వే చేశామన్నారు. దేశ వ్యాప్తంగా పది జోనులలో   ఐదువేల రక్త నమూనాల ను సేకరించి హైదరాబాద్ లో ఐదు వందల రక్త నమూనాలను సేకరించి కోవిడ్ ఉధృతి ఏ విధంగా ఉందో అంచనా కు వస్తారని వారు తెలిపారు.

తొట్టంబేడులో ఒకరి హత్య, మరో ఇద్దరికి గాయాలు

Tags: Corona tests in manneguda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *