భయాందోళనలో మండల ప్రజలు
సెకండరీ కాంటాక్ట్లపై అధికారులు ఆరా
Date:09/05/2020
రామసముద్రం ముచ్చట్లు:
మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం మినికి గ్రామంలో 50 సంవత్సరాల వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. శుక్రవారం మదనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అతనికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్ రావడంతో అతన్ని చిత్తూరుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి వైరాలజీ ల్యాబ్ నుండి పూర్తి ఫలితాలు వచ్చే వరకు నిర్ధారణ చేయలేమని మెడికల్ ఆఫీసర్ గీతా కుమారి తెలిపారు. కరోనా లక్షణాలున్న వ్యక్తి ట్రక్ డ్రైవర్ గా గుర్తింపు. అతనితో పాటు కుటుంబ సభ్యులకు కరోన పరీక్ష నిర్వహించగా వీరికి ఫలితాల్లో నెగటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అతని కాంటాక్ట్ లో ఉన్న ట్రక్ యజమానితో పాటు మరో 20 మందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. మండల అధికారులు గ్రామాన్ని రెడ్ జోన్ ప్రకటించారు. ఇతని పూర్తి కాంటాక్ట్ జాబితా సేకరించే పనిలో అధికారిక యంత్రాంగం నిమగ్నమైంది. పాజిటివ్ నమోదు అయిన వ్వక్తి చెన్నై కోయంబేడు మార్కెట్ కు కూరగాయలు తీసుకొని వెళ్ళినట్లు అధికారులు తెలిపారు.
ఆధునిక వైద్య పరీక్షలు , అత్యంత మెరుగైన చికిత్సలతో కరోనా కట్టడి
Tags: Corona that touches the Ramasamudram zone