మరో వైసీపీ ఎమ్మెల్యే కి కరోనా !

Date:14/07/2020

అమరావతి  ముచ్చట్లు:

ఏపీలో కరోనా మహమ్మారి భారిన పడేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు అధికార వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే లు కరోనా భారిన పడగా..తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది అని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. నెల్లూరు జిల్లా వైసీపీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో కరోనా సోకిందేమో అన్న అనుమానంతో అయన కరోనా నిర్దారణ టెస్ట్ చేయించుకోగా  కరోనా పాజిటివ్ అని తేలిందని . దీనితో వెంటనే ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. చెన్నై కి సూళ్లూరుపేట  దగ్గర కావడంతో అయాన చెన్నై లోని అపోలో లో జాయిన్ అయ్యాడు అని తెలుస్తుంది. అలాగే  ప్రస్తుతం  ఎమ్మెల్యే  సంజీవయ్యకు  కరోనా లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఏపీలో కొత్తగా 1935 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో రాష్ట్రంలో  మొత్తం కరోనా కేసుల సంఖ్య 31103కి చేరింది.  ఇప్పటివరకూ 16464 మంది డిశ్చార్జి అయ్యారు.  ఇప్పటి వరకు 365 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 14274 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

విజయనగరంలో రౌడీ రాజ్యం

Tags:Corona to another YCP MLA!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *