సానియా మీర్జాకు కరోనా

Date:20/01/2021

హైదరాబాద్  ముచ్చట్లు:

;నాకు కరోనా పాజిటివ్ గా తేలింది అని భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా వెల్లడించారు. ఈ వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని  తెలిపారు. కరోనా  సమయంలో తన అనుభవాల్ని సానియా మీర్జా ట్వీట్లో పోస్ట్ చేశారు. తనకి కరోనా  పాజిటివ్ అని తేలినప్పటికీ.. తనకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని  అయినా తాను ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ లోనే ఉన్నానని అన్నారు.ఈ సమయంలో తన రెండేళ్ల బాబు కుటుంబాన్ని విడిచిపెట్టి ఉండడం చాలా కష్టంగా అనిపించిందని సానియా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇదే సమయంలో కరోనా బారినపడి అందరికీ దూరంగా ఆస్పత్రులలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు ఎలాంటి బాధను అనుభవించాయన్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోజుకో కొత్త లక్షణం కనిపించినప్పుడు ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని భౌతికంగా మానసికంగా ఎంతో సంఘర్షణకు గురవుతామని తన అనుభవాల్ని వెల్లడించారు.
అయితే కొద్దో గొప్పో తాను అదృష్టవంతురాలినని కాకపోతే కుటుంబానికి దూరంగా ఉండటం మాత్రం భయంకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఫ్యామిలీని ఎప్పుడు చూస్తామో తెలియదని తెలిపింది. వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉందని… మన సన్నిహితులను కుటుంబాన్ని దీని నుంచి కాపాడుకోవడాన్ని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags:Corona to Sania Mirza

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *