కరోనా చికిత్స పొందుతూ ప్రసవం

తిరుపతి ముచ్చట్లు :

టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ భార్య కరోనా చికిత్స పొందుతూ ప్రసవించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. స్థానిక అంకుర ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. రైల్వే కోడూరు లోని టాస్క్ ఫోర్స్ సబ్ కంట్రోల్ కానిస్టేబుల్ పి. సుజయ్ కుమార్ (పి సి 694) భార్య సంధ్య కు ఏప్రిల్ 25న పాజిటివ్ వచ్చింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి. కడప రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఈ విషయాన్ని డిఐజి క్రాంతి రాణా టాటా, డీజీపీ దృష్టి కి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో డిఐజి ఆమెను తిరుపతి కి వెంటిలేటర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆసుపత్రిలలో బెడ్లు ఖాళీ లేకపోయినా అంకుర ఆసుపత్రి యాజమాన్యం తో మాట్లాడి చేర్పించారు. ఎప్పటికప్పుడు డాక్టర్లు తో డిఐజి మాట్లాడుతూ ఆమెకు ఆపరేషన్ చేయించారు.ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను 25 రోజుల పాటు ఆసుపత్రిలో సంరక్షించారు. ఆమెను సోమవారం డిశ్చార్జి చేశారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Corona treatment receiving childbirth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *