Welcome to the Corona winners

 జర్నలిస్టులను వదలని కరోనా వైరస్.. –  “ఖని”లో కరొనతో యువ జర్నలిస్ట్ రామచందర్ మృతి

Date:11/08/2020

పెద్దపల్లి ముచ్చట్లు:

 

జనం కోసం పని చేస్తున్న జర్నలిస్టు లను కూడా చివరికి.. కరోనా వదిలిపెట్టడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు జర్నలిస్టులు కరోనాతో మృత్యవాతపడగా.. తాజాగా గోదావరిఖనిలో మరో యువ జర్నలిస్ట్ బలయ్యాడు. స్థానిక ఎల్బీ నగర్ కు చెందిన భోగే రామచందర్ అనే జర్నలిస్ట్ మంగళవారం కరోనా వైరస్ తో మృతి చెందాడు. రామచందర్ ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నాడు. మంచి కలాభిమాని. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం, ప్రజలను చైతన్య వంతం చేయడానికి అనేక వార్తలను అందించాడు. వారం రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామచందర్కు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. మూడు రోజులుగా వేటిలేటర్ పై ఉన్న రామచందర్ కోలుకుంటున్నాడు అని అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ కరోనా మహమ్మారి రామచందర్ ఊపిరి తీసుకుంది. మంగళవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ కార్యవర్గంతోపాటు సీనియర్ జర్నలిస్టులు రామచందర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

 వైయస్సార్ చేయూత  లబ్ధిదారుల  ఎంపికపై  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లతో  సమీక్ష

 

Tags:Corona virus not leaving journalists .. – Young journalist Ramachander dies with Corona in “mine”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *