జగిత్యాల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కు  కరోనా వారియర్స్ అవార్డ్

Date:29/10/2020

జగిత్యాల  ముచ్చట్లు:

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ కరోనా వారియర్స్ అవార్డు కు ఎంపికైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన” ప్రజా భాంధవి” స్వచ్ఛంద సంస్థ లాక్ డౌన్ పీరియడ్ లో వివిధ రంగాల్లో సేవలందించిన సంస్థను,వ్యక్తులను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి సిరిసిల్ల రాజన్న జిల్లా వ్యాప్తంగా తమ సంస్థ ప్రతినిధులు చేసిన సర్వేలో ఉత్తమ సేవలు అందించిన సంస్థల కేటగిరిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలు,మాస్కుల వినియోగం లాంటి అంశాలపై ప్రజలను చైతన్య చైతన్య పరచడంతో పాటు సీనియర్ సిటిజన్ సంస్థ అయి ఉండి తమ సంఘం ప్రతినిధులతో నిరుపేదలకు, వయోవృద్ధులకు సహాయాలను అందించే కార్యక్రమాలను
లాక్ డౌన్ పీరియడ్ లలో నిర్వహించినందుకు”కరోనా వారియర్స్ సంస్థ”

 

 

అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ జిల్లా కేంద్రంలో విలేకరులతో గురువారం మాట్లాడారు తమ రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు ప్రోత్సాహంతో సూచనలతో ఈ సేవలకు ప్రతిష్టాత్మకంగా కరోనా వారియర్స్ అవార్డు మా అసోసియేషన్ కు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,జగిత్యాల, కోరుట్ల ,మెట్పల్లి,రాయికల్, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్లు భోగ
శ్రావణి, అన్నం లావణ్య,రానవేణి సుజాత,సంగి సత్తమ్మలు హరి అశోక్ కుమార్ ను అభినందించారు.

అగ్ని ప్రమాదాలు తగ్గాయి

Tags: Corona Warriors Award to Jagitya Senior Citizens Association

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *