Date:05/12/2020
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీనివాసంలో కోవిడ్ కేంద్రం లో కరోనా భాదితులకు సపర్యలు చేసిన కరోనా వారియర్స్ కు ఇవ్వాల్సిన జీతాలను వెంటనే ఇప్పిం చాలని కోరారు. శనివారం వుదయం తిరుపతి ఎమ్ యల్ ఏ తనయుడు భూమన అభినయ్ రెడ్డి ని శ్రీనివాసం కోవిడ్ కేంద్రం కరోనా వారియర్స్ వై యస్ ఆర్ సి పి నేత యన్. రాజా రెడ్డి అడ్వర్యంలో కలిసి జీతాలు ఇప్పించాలని కోరారు. కరోనాలో భావితులకు సపర్యలు చేయాలని మీ సూచన మేరకు మేము అనేక కష్టాలని ఎదుర్కొని పని చేయడం జరిగిందని మాలో కరోనా తో ఇద్దరు చనిపోవడం జరిగిందని అయిన మేము పని చేసామని అటువంటి మాకు 80రోజుల జీతం ఒక్కొక్కరికి పదహారు వేల రూపాయలు ఇవ్వాలని తెలిపారు. వెంటనే అభినయ్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కి పోన్ చేయగా బిల్లు పెడుతున్నామని బిల్లు వచ్చిన వెంటనే ఇస్తా మని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో యూనియన్ నాయకులు గోవింద స్వామి, శ్రీనివాస రెడ్డి, బాలాజి, సుధ కర రెడ్డి, భూపతి, పురుషోత్తం, అంకమ్మ, రేవతమ్మ్, రమాదేవి, తులసిమాల, సుజాత పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి
Tags: Corona Warriors beg Bhumana Abhinay Reddy to see our salaries