కరోనా కు ఎంపీ ల్యాడ్స్ ఇచ్చాం 

Date:17/09/2020
న్యూఢిల్లీ ముచ్చట్లు:

కోవిడ్ పున‌రావాస కార్య‌క్ర‌మాల‌కే ఎంపీ ల్యాడ్స్ నిధులు వెళ్లాల‌ని టీఆర్ఎస్ ఎంపీ కే కేశ‌వ రావు తెలిపారు. ఇవాళ ఆయ‌న రాజ్య‌స‌భ‌లో మాట్లాడారు.  ఎంపీలు, మంత్రుల జీతాల కోత బిల్లుపై ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు త‌మ నిధుల‌ను ఒక ఏడాది పాటు స్వ‌యంగా ఇచ్చేందుకు అంగీక‌రించామ‌ని ఎంపీ కేశ‌వ‌రావు గుర్తు చేశారు.  సుమారు వంద కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధుల‌ను కేంద్రానికి ఇస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. స‌దరు కేంద్ర మంత్రికి కూడా ఈ విష‌యం తెలుసు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  అయితే త‌మ రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇచ్చిన నిధుల‌ను కేవ‌లం కోవిడ్ పున‌రావాస కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే వినియోగించాల‌ని ఆయ‌న అన్నారు.  ఎంపీ నిధుల‌పై కేంద్రం విధించిన ష‌ర‌తును వ్య‌తిరేకిస్తున్నా.. తాము ఇచ్చిన నిధులు మాత్రం కోవిడ్ రిహాబిలిటేష‌న్‌కే వాడాల‌న్నారు.

Tags:Corona was given MPs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *