కేసులు తగ్గడంతో పాటు రోజువారీ పాటివిటీ రేటు తగ్గుతూ వస్తున్న కరోనా

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
దేశంలో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది. ఇందులో 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,905 మంది మృతిచెందగా, 2,92,092 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గురువారం నాటికంటే ఇవి 4837 తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా 492 మంది మరణించారని, 66,254 కరోనా నుంచి బయటపడ్డారని తెలిపింది. కరోనా కేసులు తగ్గడంతో రోజువారీ పాటివిటీ రేటు కూడా తగ్గుతూ వస్తున్నది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2.07 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,74,64,99,461 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
 
Tags; Corona with decreasing cases as well as decreasing daily activity rate

Leave A Reply

Your email address will not be published.