Coronal examinations in Punganur

పుంగనూరులో కరోనా పరీక్షలు

Date:30/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో కరోనా ప్రభలడంతో పట్టణ ప్రజలు కరోనా స్వాబ్‌ పరీక్షలు చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. మంగళవారం కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి స్వీయ పర్యవేక్షణలో ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రజలకు 55 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు 580 మందికి స్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ముడిబాపనపల్లె పిహెచ్‌సి సూపర్‌వైజర్లు మురళి, హరినాథ్‌, ఏఎన్‌ఎంలు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు దగ్గరుండి స్వయంగా నిర్వహిస్తుండటంతో పట్టణ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

కరోనా నియంత్రణలో కార్మికుల సేవలు మరువలేం

Tags: Coronal examinations in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *