చెన్నైలో 17 కు చేరిన కరోనా కేసులు

Date:30/03/2020

చెన్నై,ముచ్చట్లు:

కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1071కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో 29మంది మృతిచెందగా, 942 మంది చికిత్స పొందుతున్నారు, మరో 100 మంది కోలుకున్నారని తెలిపింది. కాగా, తమిళనాడులో సోమవారం మరో 17 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 67కి చేరింది. ఇప్పటి వరకూ తమిళనాడులో కరోనా వైరస్‌తో ఇద్దరు మృతిచెందారు. తమిళనాడులో కరోనా వైరస్ నియంత్రణకు మిగతా రాష్ట్రాల కంటే ముందే అక్కడ ప్రభుత్వం స్పందించింది. అన్ని రాష్ట్రాలతో సరిహద్దులను మూసేసి, ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.పారిశుద్ధ్య కార్మికుల కొరతతో ప్రజలే స్వచ్ఛందంగా కొన్ని చోట్ల కరోనా వైరస్ కట్టడికి శానిటేషన్ పనులు చేస్తున్నారు. పసుపు, వేపాకులు నీటిలో కలిపి వీధుల్లో ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. రామనాథపురం జిల్లాలోని పెరియార్ గ్రామస్థులు తమ గ్రామంలోని వీధుల్లో పసుపు, వేపాకులతో కలిపి నీటిని జల్లుతున్నారు. కాగా, మహారాష్ట్రలో 12, మధ్యప్రదేశ్ 8, గుజరాత్ 6, జమ్మూ కశ్మీర్ 3, ఆంధ్రప్రదేశ్ 2, పశ్చిమ్ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్‌లో ఒక్కో కొత్త కేసు సోమవారం నిర్ధారణ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం వరకు కొత్తగా మొత్తం 53 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో పలు నగరాల నుంచి కార్మికులు, వలస కూలీలు తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్కడివారు అక్కడే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తిచేస్తున్నా వేలదిగా కూలీలు కాలినడకన బయలుదేరుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

రోగులకు ఎమ్మెల్యే సేవలు

Tags:Coronation cases involving 17 in Chennai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *