కేటీఆర్‌కు పట్టాభిషేకం కష్టమే: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

Date: o6/01/2020
హైదరాబాద్ ముచ్చట్లు:

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడితే మంత్రి కేటీఆర్‌కు పట్టాభిషేకం కష్టమేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఓడితే కేసీఆరే సీఎంగా కొనసాగుతారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మంలో ఎన్నికలు లేకున్నా ముందే రిజర్వేషన్లు ఖరారు చేయడం సరికాదని ఆయన తప్పుబట్టారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, ప్రత్యర్థులను బలహీనపరిచే విధంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆరోపించారు. రిజర్వేషన్లు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కోదండరాం తెలిపారు. వారసుడి పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గం సుగమం చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి పావులు కదుపుతున్నారు. మునిసిపల్‌ ఎన్నికల తర్వాత లేదా.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తర్వాత ముహూర్తం నిర్ణయించాలనే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. రాహుల్‌ గాంధీ విషయంలో సోనియా గాంధీ చేసిన పొరపాటును తాను చేయరాదని కేసీఆర్‌ భావిస్తున్నారని, అందుకే, వారసుడి పట్టాభిషేకం దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.

 

ప్రధాని మోడీతో మోహన్ బాబు భేటీ

 

Tags:Coronation of KTR is difficult: TJS president Kodandaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *