Coronavirus affects about one in four of the nation's capital population

దేశ రాజధాని జనాభాలో దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్

Date:21/07/2020

దిల్లీ ముచ్చట్లు:

దేశ రాజధాని దిల్లీ నగర జనాభాలో దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు ఒక నమూనా సర్వే సూచిస్తోంది.ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో.. 21,387 మంది రక్త నమూనాలను పరీక్షించగా వారిలో 23.48 శాతం మందిలో కరోనావైరస్‌కు సంబంధించిన యాంటీబాడీస్ కనిపించాయి. అంటే వారికి ఈ వైరస్ సోకి ఉండటమో, సోకి తగ్గటమో జరిగిందని అర్థం.నగరంలో నిర్ధారిత కేసుల సంఖ్య సూచించే దానికన్నా చాలా ఎక్కువగా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు ఈ సర్వే సూచిస్తోంది.దిల్లీలో ఇప్పటివరకూ 1,23,747 కేసులు ఉన్నాయి. ఇది మొత్తం 1.98 కోట్ల నగర జనాభాలో ఒక శాతంతో సమానం.అయితే.. రాండమ్‌గా నిర్వహించిన సాంపిల్ సర్వే 23.44 శాతం మందికి వైరస్ సోకినట్లు సూచిస్తోంది. ఆ లెక్కను నగర జనాభా సంఖ్యకు అన్వయిస్తే కరోనా సోకిన వారు 46.5 లక్షల మంది ఉండాలి.

6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగింపు

Tags: Coronavirus affects about one in four of the nation’s capital population

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *