ఆధునిక వైద్య పరీక్షలు , అత్యంత మెరుగైన చికిత్సలతో  కరోనా కట్టడి

Date:09/05/2020

మచిలీపట్నం ముచ్చట్లు:

కృష్ణాజిల్లాలో 41 కంటోన్మెంట్ జోన్లలో కఠినమైన నిబంధనలు పాటించడం, పాజిటివ్ కేసులను గుర్తించి పరీక్షలు జరిపి ఉత్తమమైన చికిత్స అందించడం ద్వారా గణనీయంగా కోవిడ్ – 19  ఉదృతిని కట్టడి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ పేర్కొన్నారు.శనివారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం  ఆర్ అండ్ బి అతిధి గృహంలో రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో జిల్లాలో పరిస్థితిపై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  ఒకవైపు సక్రమమైన ఆధునిక వైద్య పరీక్షలు , మరోవైపు అత్యంత మెరుగైన చికిత్స కృష్ణాజిల్లాలో అందిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 2500కిపైగా కరోనా టెస్టులు చేస్తున్నామని ఇది ఒక రికార్డు అని పేర్కొన్నారు.  సుమారుగా 35 రోజుల కింద మనకు స్విమ్స్‌ తప్ప మరో చోట టెస్టింగ్‌ సౌకర్యం లేదని, అది కూడా రెండు రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవని ఆయన ‌ వివరించారు. జిల్లాల్లో టెస్టింగ్‌ సౌకర్యాలు, ట్రూనాట్‌ కిట్లు కూడా అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.

 

మచిలీపట్నం లో మూడు కంటోన్మెంట్ జోన్లలో ఒక కంటోన్మెంట్ జోన్ సాధారణ స్థాయికి చేరుకోందని త్వరలోనే గ్రీన్ జోన్ గా మారనుందన్నారు . అలాగే రెండవ కంటోన్మెంట్ జోన్ వెరీ యాక్టివ్ దశ నుంచి యాక్టివ్ దశకు వచ్చిందన్నారు. మరి కొద్ది కాలంలో అక్కడ సైతం సాధారణ స్థితికి వస్తుందన్నారు. మూడవ కంటోన్మెంట్ జోన్ కొత్తగా వచ్చిన కేసు అని వారికి ఇంట్లోనే సోకడంతో కాంటాక్ట్ కావడంతో అక్కడ యాక్టివ్ క్లస్టర్ కావడంతో  కంటోన్మెంట్  ప్రామాణికాలు పాటించాలని బందరు ఆర్డీవో , తహసీల్దార్ , మునిసిపల్ కమీషనర్ తెలియచేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

 

 

కృష్ణాజిల్లాకు వచ్చే సోమవారం , మంగళవారం నుంచి ప్రవాస భారతీయులు పలు విదేశాల నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  వారి కోసం ప్రభుత్వ , ప్రవేట్ క్వారంటైన్ సౌకర్యం సిద్ధంగా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కృష్ణాజిల్లా నుంచి 4 వేలమంది వలస కూలీలను మహారాష్ట్రకు అత్యంత జాగ్రత్తలు తీసుకోని పంపించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే 1000 మందిని బస్సులలో రాజస్థాన్ తరలించామని, శనివారం ( నేడు ) రెండు రైళ్లలో విజయవాడ నుంచి బీహార్ కు 800 మందిని , ఒరిస్సాకు 1200 మందిని సురక్షితంగా పంపించింతలు చెప్పారు.  వేరే రాష్ట్రాల నుంచి సరైన అనుమతులతో కృష్ణాజిల్లాకు వచ్చేవారిని  క్వారంటైన్ లలో విధిగా ఉంచి తగిన విధమైన  స్క్రీనింగ్ , యాదృచ్ఛిక పరీక్షలు జరిపిన తర్వాతనే వారి ఇళ్లకు పంపించడం జరుగుతుందన్నారు.

 

 

 

 

 

కృష్ణా జిల్లాలో  300 కేసులు నమోదైతే , వారిలో 150 మంది ప్రజలు డిశ్చార్జ్ అవుతున్నారని అన్నారు. శుక్రవారం క్వారంటైన్ నుండి విడుదల కాబడినవారిలో 75 ఏళ్ళ వయస్సు పైబడిన వృద్దులు ఇరువురు ఉన్నారని, దీనిని బట్టి ప్రజలకు ఎంత మెరుగైన చికిత్సను ప్రభుత్వం అందిస్తుందో గమనించాలన్నారు. వచ్చే సోమవారం , మంగళవారం రోజులలో 50 మందికి పైగా  క్వారంటైన్ నుండి ఆరోగ్యంగా వారి వారి ఇళ్లకు చేరుకోవడం ఒక శుభ పరిణామన్నారు. ఆ తర్వాత కృష్ణాజిల్లాలో యాక్టివ్ కేసులు 100 మాత్రమే ఉంటాయనని కలెక్టర్ తెలిపారు. కృష్ణాజిల్లాలో  గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్‌వర్క్ ‌ఉందన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో పలుశాఖల అధికారులు  చక్కటి పని తీరును చూపారని పేర్కొన్నారు.

తాడేపల్లిలో కరోనా కలకలం

Tags: Coronavirus with advanced medical examinations and highly improved treatments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *