అప్పుల్లో కార్పోరేషన్ 

Date:23/09/2020

నెల్లూరు  ముచ్చట్లు

ఎన్ని ఇబ్బందులు ఉన్న రాబోయే ఆరు, ఏడు నెలల్లో నెల్లూరు కార్పొరేషన్ రూపురేఖలను మార్చేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో  కార్పొరేషన్ కు వచ్చే ఆదాయ వనరులు… ప్రతి ఏడాది ప్రజల కోసం ఖర్చు చేస్తున్న  వనరులు వంటి అంశాలపై అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని  సూచించారు.. కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ ను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.. కార్పొరేషన్ కి వచ్చే ఆదాయ వనరులను మరింత పెంచుకోవాలని అలాగే వీలైనంత వరకూ తగ్గించే విధంగా చూడాలన్నారు. కార్పొరేషన్ కు సంబంధించి 72 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వీటిపై సిబ్బంది దృష్టి సారించాలన్నారు కార్పొరేషన్ కు సంబంధించి అప్పులు చూసుకుంటే మరో 60 కోట్ల వరకు ఉన్నాయన్నారు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఆదాయ వనరులు మరింత మెరుగు పడాలన్నా రు.

 

 

వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి కూడా బకాయిలు ఉన్నాయని వాటిపై కూడా దృష్టి సారించాలన్నారు విద్యుత్ బిల్లులకు సంబంధించి 15 కోట్ల బకాయిలు దాకా కార్పొరేషన్ చెల్లించాల్సి ఉందన్నారు. 2019 నాటికే కార్పొరేషన్ 60 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. అత్యవసర పనులు చేయాలన్న ముందు పాత బకాయిలు చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. Covid కారణంగా కార్పొరేషన్ కు వచ్చే ఆదాయం కూడా ఇటీవల గణనీయంగా తగ్గిందన్నారు వీటినన్నిటిని సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నామన్నారు. వార్డ్ కార్యదర్శులు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించి వారినుంచి మెరుగైన సేవలు రాబట్టే విధంగా పని చేస్తామన్నారు.. ఈ సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడుతున్న విద్యార్థులు

Tags:Corporation in Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *