నవంబరు25 నుండి కార్పొరేషన్ ఇంటర్వ్యూలు

Date:21/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

నవంబరు 25 నుండి మూడు రోజులు పాటు కార్పొరేషన్ రుణాలు కొరకు నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ లక్ష్మీపతి తెలిపారు. మండల అభివృద్ధి కార్యాలయంలో 25న ఎస్సీ, ఎస్టి, 26 న మైనారిటీ, 27న బిసి, కాపు కులాల వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ రుణాలు కొరకు నమోదు చేసుకున్న  అభ్యర్థులకు పోస్టల్ కార్డులు అందకపోయినా ఆన్లైన్లో నమోదు చేసుకున్న ప్రతి అభ్యర్థి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. మండలం వ్యాప్తంగా 1600 మంది కార్పొరేషన్ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

 

సుప్రీంకోర్టు తీర్పు ఆశాజనకంగా లేదు

 

Tags:Corporation interviews from November 25th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *