సరస్సులో  కుప్పులు కుప్పలుగా  శవాలు

Date:22/08/2019

డెహ్రాడూన్ ముచ్చట్లు:

ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్ ప్రాంతంలో ఓ భయానకమైన సరస్సు ఉంది. ఈ సరస్సు ఏడాదిలో 11 నెలలు మంచుతో కప్పి ఉంటుంది. మే నెలలో మాత్రమే ఆ సరస్సులో నీరు కనిపిస్తుంది. అంతేకాదు, వందల సంఖ్యలో అస్థిపంజరాలు సైతం ప్రత్యక్షమవుతాయి. ఇంతకీ ఆ అస్థిపంజరాలు ఎవరివీ? ఆ సరస్సు వద్దకు వెళ్తే ఏం జరుగుతుందనేది మిస్టరీగా నిలిచింది. చమోలి జిల్లాలో సముద్ర మట్టానికి 5,029 మీటర్ల ఎత్తులో ఈ సరస్సు ఉంది. 1924లో బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన ఓ అటవీ అధికారి తొలిసారిగా వీటిని చూశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని వందల అస్థిపంజరాలు పర్యాటకుల కంటపడ్డాయి. అయితే, ఆ అస్తిపంజరాలు ఎవరివీ? అక్కడ వందల సంఖ్యలో ప్రజలు ఎందుకు చనిపోయారు? అసలేం జరిగింది?

 

 

 

 

ఇక్కడి రహస్యాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (CCMB) అంతర్జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి పదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ లభించిన అస్థికలకు వేల ఏళ్ల చరిత్ర ఉందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎంపీలోని ఎన్సియంట్ డీఎన్ఏ క్లీన్ ల్యాబ్‌లో పరిశోధనలు చేపట్టారు. ఈ సందర్భంగా 72 ఎముకలను పరిశీలించారు. సరస్సు నుంచి సేకరించిన అస్థిపంజరాల అవశేషాల్లో సగం భారతీయులవని, మిగతావి గ్రీస్, కిట్రా, మధ్యధరా ప్రాంతం, కిట్రా జాతులకు చెందినవని తెలిసింది.

 

 

 

 

 

మరొక అవశేషాన్ని ఆగ్నేయాసియా ప్రాంతానికి చెందినవారిది. రూప్‌కుండ్ మీదుగా నందాదేవీ దర్శనానికి వెళ్లే భక్తులు, వ్యాపార నిమిత్తం టిబెట్‌కు వెళ్లే వ్యాపారులు ప్రకృతి విపత్తుల్లో చిక్కుకుని ఈ సరస్సులో పడిపోయి ఉండవచ్చని భావించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం వేలాది సంవత్సరాల్లో ఎంతమంది బలి తీసుకుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

30  కోట్లతో కాళేశ్వరం ప్రచారం

Tags: Corpses in piles of piles in the lake

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *