ఇంద్రకీలాద్రిలో దిద్దుబాటు చర్యలు-13 మంది పై వేటు

Date:23/02/2021

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ దుర్గ గుడిలో పనిచేస్తున్న పలువురు  ఉద్యోగులు సస్పెన్షన్ కు గురికావడం కలకలం రేపింది. ఒకేసారి ఐదుగురు సూపరింటెండెంట్లు సహా 13 మంది సస్పెన్షన్ కావడం దేవాదాయ శాఖలో చర్చనీయాంశమయింది.  ఏసీబీ ప్రాథమిక నివేదిక ఆధారంగా దుర్గగుడి ఉద్యోగులపై చర్యలు  తీసుకున్నారు.  ఇటీవల ఏసీబీ అధికారులు ఆలయంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు మూడు రోజులపాటు పదుల సంఖ్యలో ఏసీబీ అధికారులు, సిబ్బంది పలు విభాగాల లేక్కలను పరిశీలించారు. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.

 

 

దాంతో 13 మందిని ఇవో సురేష్ బాబు సస్పెండ్ చేసారు. వీరిలో పలువువు గుమాస్తాలు, సూపరిడెంట్ లు వున్నారు.  మాక్స్ సెక్యురిటికి టెండర్లు ఖరారు చేసిన మొత్తం సిబ్బందిపై వేటు పడింది. సస్పెండ్ అయినవారిలో సూపరిడెంట్ అమృతరావు, భాగ్యజ్యోతి, చందు శ్రీనివాస్, హారికృష్ణ, శ్రీనివాసమూర్తి, గుమస్తాలు  శారీస్ సెక్షన్ మధు, పాతపాడు నాగేశ్వరరావు,  పోటో కౌంటర్ రాంబాబు,  టిక్కెట్లు కౌంటర్ పి రవి, డోనేషన్ కౌంటర్ కె రమేష్ వున్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Corrective action in Indrakeeladri-13 hunting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *