స్వార్ధం కోసం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు

Date:19/09/2020

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో దళితులు, గిరిజనులు, బీసీలపై ఎవరైనా దాడి చేస్తే అది తనపై జరిగిన దాడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజన, బీసీలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు శనివారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. తన పాలనలో దళితులకు అన్యాయం చేసినందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దళిత శంఖారావమని చంద్రబాబు పిలుపు ఇస్తే నమ్మాలా? అని ప్రశ్నించారు.చంద్రబాబు దళిత ద్రోహి అని మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. సీఎం హోదాలో ఉండి దళితుడిగా ఎవరైనా పుడతారా? అని అడిగిన వ్యక్తి చంద్రబాబు అని.. దళితుల మధ్య ఇప్పటికే ఓసారి చిచ్చు పెట్టారని, మళ్లీ ఇలాంటి పని చేస్తే వారే చంద్రబాబుకు దేహశుద్ధి చేసే పరిస్థితి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

 

 

కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తూ ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం.. కులాల అయిపోయి మతాల మీద పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు మతాల మధ్య చిచ్చు పెడుతూ తన పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జూమ్ రాజకీయాలను ప్రజలు నమ్మబోరని వ్యాఖ్యానించారు.కొందరు తమ స్వార్థం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని.. వ్యవస్థల పనితీరుపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వాస్తవమని, చంద్రబాబు బినామీలు రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు కొన్నారని తెలిపారు. ఆయన తన ఆస్తులను కాపాడుకునేందుకే రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో దోషులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.

కరోనాతో పెరిగిన గుడ్డు ధర

Tags: Corrupting the system for selfishness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *