Natyam ad

సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఊడలు!

_అవినీతి తిమింగలాలపై ఏసీబీ దాడులు చేస్తున్న డోంట్ కేర్

_సబ్ రిజిస్ట్రార్లకు బినామీలుగా డాక్యుమెంట్ రైటర్లు?

_రిజిస్ట్రేషన్ విలువలో 2 శాతం లంచం ఇస్తేనే, రిజిస్ట్రేషన్

Post Midle

_ప్రతి పనికి ప్రత్యేక రేట్లు పెట్టి మరి అడ్డగోలు దందా

_మీడియాతో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి లంచాలు ఇచ్చుకున్న బాధితుల గగ్గోలు

 

సత్యవేడు ముచ్చట్లు:


అది దేశానికి తలమానికంగా నిలిచిన ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీ సిటీ కొలువైయున్న సత్యవేడు ప్రాంతం, మాములుగానే అక్కడ భూములు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మన రాష్ట్రం వారే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ క్యూ కడుతున్నారు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి, భారీగా క్రయవిక్రయాల సైతం సాగుతున్నాయి, బ్యాంకులు సైతం ఇల్లును, ఇంటి స్థలాలను తనఖా పెట్టుకుని లోన్లు మంజూరు చేస్తూ వస్తున్నాయి ఈ క్రమంలో ఇళ్లను వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రైతులు సైతం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు, దీన్ని అదునుగా చేసుకున్న తిరుపతి జిల్లా సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది అడ్డగోలుగా దోచుకుంటూ అవినీతికి పడగలెత్తుతున్న వైనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది, రిజిస్ట్రేషన్లు కార్యాలయానికి క్యూ కట్టే వ్యాపారస్తులు, ప్రజలను నిలువునా దోచేస్తూ జిల్లాలోనే అవినీతిలో టాప్ గా నిలుస్తున్నారన్న ఆరోపణలు సర్వత్ర మారుమోగుతున్నాయి. ప్రతీ పనికో రేటు నిర్ణయించి చేతివాటం ప్రదర్శించడం సిబ్బందికి అలవాటైపోయింది. పైసలు ఇవ్వకపోతే పని జరగకపోగా గంటలో కావాల్సిన పనికి రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.

 

 

 

ఇదేమిటని ప్రశ్నించిన వారిని ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని జులుం ప్రదర్శిస్తున్నారు, అది కుదరదు అంటే సర్వర్ పని చేయడం లేదు, భూములకు పత్రాలు సక్రమంగా లేవు, ఈ డాక్యుమెంట్ లో ఈ చిన్న అక్షరం తప్పుగా ఉంది, ఇందులో నెంబర్ కరెక్టుగా లేదు అంటూ కుంటి సాకులు చెప్పి రోజుల తరబడి కార్యాలయాలు వెంబడి తిప్పుకుంటున్నారు, అదే పనికి పైసలిస్తే పదినిమిషాల్లో చేసి ఆప్యాయంగా చేతికి అందిస్తున్నారు. తల దాచుకునే జాగా… తనదనుకునే ఓ నివాసాన్ని సొంతం చేసుకోవాలన్న ఆశతో సబ్ కార్యాలయానికి వస్తున్న ప్రజలను ఇక్కడి సిబ్బంది పీల్చి పిప్పి చేస్తున్నారు, దళారులతో కలసి అడ్డగోలుగా వసూలు చేస్తు అందినకాడికి దోచుకోవడం, వాటాలు లెక్కన అందరు పంచుకోవడం ఇక్కడ రివాజుగా మారిపోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు! ఈ నేపథ్యంలో ఇదే విషయమై సత్యవేడులో మీడియా ప్రతినిధులతో

 

 

 

మాట్లాడిన సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయ అవినీతి బారిన పడ్డ బాధితులు తమ గోడును మీడియా ఎదుట గురువారం ఎంపీడీవో కార్యాలయం వద్ద వెళ్ళబోసుకున్నారు, అసలు వివరాల్లోకి వెళ్ళితే బుచ్చినాయుడు కండ్రిగ మండల పరిధిలోని నెలవాయి గ్రామానికి చెందిన రేష్మ అనే మహిళ నాలుగు సెంట్లు ఉన్న తన ఇంటి రిజిస్ట్రేషన్ కోసం సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న రాజశేఖర్ అనే వ్యక్తిని సంప్రదించింది, అతను నాలుగు సెంట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వాలంటే 85000 ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పారు, దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పై 85000 సదరు వ్యక్తికి ఇచ్చిన రేష్మ రిజిస్ట్రేషన్ అయిన నెల తర్వాత డాక్యుమెంట్లు చూసుకున్నానని, అందులో ప్రభుత్వానికి 26000 మాత్రమే చెల్లించినట్లు డాక్యుమెంట్లు రసీదు ఉందని తన దగ్గర 85000 తీసుకొని 26000 మాత్రమే ప్రభుత్వానికి ఎందుకు కట్టారని తన మోసం చేసి ఇలా అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా వారు కనికరించలేదని, తన కుటుంబ పోషణ కోసం అప్పు తీసుకొని మరి కార్యాలయ సిబ్బందికి లంచంగా ఇచ్చానని బోరున విలపించింది, ఈ విషయమై సత్యవేడు సబ్ రిజిస్టర్ కు తెలిపిన నాకేం సంబంధం లేదని చేతులెత్తేసారన్నారు, అదే నిలబై గ్రామానికి చెందిన మరో మహిళ లలితమ్మ మూడు సెంట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం 75 వేల రూపాయలను అదే కార్యాలయంలో ఉన్న రాజశేఖర్ అనే వ్యక్తికి ఇచ్చానని ఆయన సైతం 20,000 ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన నగదును సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అందరూ వాటాలుగా పంచుకున్నారని అప్పు చేసి మరి డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఆదాయానికే చిల్లు పెట్టి మరీ దారుణంగా ఇక్కడ సిబ్బంది వ్యవహరిస్తున్నారని వారు కన్నీటి పర్యంతమయ్యారు,

 

 

 

20% నగదు చెల్లించవలసిన పనికి 100% నగదు చెల్లించుకుని పేద ప్రజలను ఈ కార్యాలయంలో సిబ్బంది నిలువునా జలగల్లాగా పేదవారి రక్తాన్ని పిలిచేస్తున్నారని తమ గోడును వెళ్ళబుచ్చారు, పేదవారు ధనికులు అనే బేధం లేకుండా ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించుకొని నిలువునా దోచుకుంటురన్నారు , ఇలా సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది చేతిలో మోసపోయిన వాళ్లు వందల సంఖ్యలోనే ఉన్నారని కొంతమంది వీరికి లంచం ఇచ్చుకోలేక రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా మిన్నకుండి పోతున్నారని బాధితులు నిర్వేదాని వ్యక్తం చేశారు, అవినీతిమయంగా మారిన సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు, అనధికార వ్యక్తులను అనుమతించొద్దని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసింది, కానీ అధికారులు దాన్ని అమలు చేసిన పాపాన పోవడం లేదు, ఇటీవల ఏపీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో.. ఏసీబీ జరిపిన దాడుల సందర్భంగా.. సబ్ రిజిస్టార్ల లంచాల వసూళ్లకు.. డాక్యుమెంట్ రైటర్లే బినామీలుగా ఉంటున్నారని తేలడంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ రైటర్లతో పాటు, అనధికారిక వ్యక్తులెవరూ ఆఫీసుల్లోకి రావొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు డాక్యుమెంట్ రైటర్లే రాజ్యం ఏలుతున్నారంటే ఇక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14400;- కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులన్నింటిపై తమ పరిశీలనకు వస్తాయి. అందులో అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంచుతాం. బాధితులను పీడించే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసులు నమోదు చేస్తాం, ఏ శాఖకు సంబంధించి ఏ అధికారిపై ఫిర్యాదు వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు!

:- ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్

సత్యవేడు రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది రాజశేఖర్ కు లంచం ఇచ్చామని బాధితులు చెబుతున్నారని కానీ ఆ రాజశేఖర్ కు తమ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని సత్యవేడు సబ్ రిజిస్టర్ చెప్పుకొచ్చారు, రాజశేఖర్ అనే వ్యక్తి ఎప్పుడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే ఉంటున్నాడని మీడియా ప్రతినిధులు సబ్ రిజిస్టర్ ను ప్రశ్నించగ కంప్యూటర్లో చిన్న చిన్న డాక్యుమెంట్లు ప్రింట్ కావాలన్నప్పుడు, కంప్యూటర్ మురాయించినప్పుడు వచ్చి మరమ్మతులు చేసి వెళ్తాడని అమే సెలవిచ్చారు, తాను సత్యవేడు సబ్ రిజిస్టర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రైవేటు వ్యక్తులు కానీ డాక్యుమెంట్ రైటర్లు గాని ఎవరు కార్యాలయంలోకి రావడం లేదని చెప్పారు!

 

Tags: Corruption in Satyavedu sub register office!

Post Midle