అవినీతికే అందలం (తూర్పుగోదావరి)

Corruption is Corruption (East Godavari)

Corruption is Corruption (East Godavari)

Date:12/10/2018
కాకినాడ  ముచ్చట్లు:
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఆన్ లైన్ విధానం అమలు చేస్తున్నా.. అక్రమసంపాదనకు అలవాటు పడిన ఉద్యోగులు..చేయి తడపనిదే చిన్నపని కూడా చేయడం లేదు. జిల్లాలో 64 మండలాల పరిధిలో 32 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా సేవలు అందుతున్నాయి. కాకినాడలోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో 14 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. రాజమహేంద్రవరంలలోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో 18 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా సేవలు అందుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో ఆన్‌లైన్‌ సేవలను గత ఏడాది డిసెంబరు నెలాఖరులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో నేరుగా ప్రజలే దస్తావేజు రాసుకునే అవకాశాన్ని ప్రభుత్వం జనవరి నుంచి కల్పించింది.
ఆన్‌లైన్‌లో పోర్టల్‌లో నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి కొన్ని ఖాళీలు నింపితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వెబ్‌సైట్‌లో అమ్మకం, లీజు దస్తావేజులు, ఒప్పందం..ఇలా పలు వివరాలు ఉంటాయి. ఏది అవసరమైతే అది క్లిక్‌ చేసి అందులో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలి. సేల్‌ అగ్రిమెంటు అయితే అమ్మే, కొనే వారి ఆధార్‌ సంఖ్యలు అప్‌లోడ్‌ చేస్తే చిరునామాలు, వివరాలు, హద్దులు వాటంతట అవే వచ్చేస్తాయి. వాటిని పొందుపరిస్తే దస్తావేజు సిద్ధమవుతుంది. రిజిస్ట్రేషన్‌ విలువ ఎంత.? చలానా ఎంత కట్టాలి..? అనేది ఆన్‌లైన్‌లోనే సమాచారం అందుతుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో ఈ మొత్తం చెల్లించే వెసులుబాటు కల్పించారు.
ఆ ప్రతాలను ప్రింట్‌ తీసుకుని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే వాటిని సరిచూస్తారు. ఒకవేళ మార్పులు, చేర్పులు ఉంటే సూచిస్తారు. అప్పుడు నేరుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.ఈ అంశంపై ముందుకెళ్లేందుకు ప్రజలు సాహసించడం లేదు. కొత్త విధానం అమలులోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా ఆన్‌లైన్‌లో ఒక్క రిజిస్ట్రేషన్‌ కూడా జరగలేదు.దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసినా స్పందన లేకపోవడంతో రాతకోతలన్నీ పాత పద్ధతిలోనే సాగుతున్నాయి. రూ.కోట్ల విలువైన ఆస్తుల లావాదేవీలు కావడంతో ఆన్‌లైన్‌ జోలికి వెళ్లడంలేదని తెలుస్తోంది.
గతంలో ఒక ఆస్తి ఎవరి పేరుతో ఉంది..? గతంలో దానిని అమ్మింది ఎవరు..? కొనుగోలు చేసింది ఎవరు..? ప్రస్తుతం ఆ ఆస్తి యజమాని ఎవరు..? ఈ వివరాలు కావాలన్నా, అందుకు సంబంధించిన నకలు పత్రాలు అవసరమైనా పెద్ద తంతు ఉండేది. మీ-సేవ సేవలు అందుబాటులోకి వచ్చాక కాస్త వెసులుబాటు కలిగినా..నిర్దేశిత రుసుము కింద రూ.200 చెల్లించి నిర్ణీత గడువులోగా సమాచారాన్ని పొందాల్సి వచ్చేది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.పౌర సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అన్నింటినీ అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), సర్టిఫికెట్‌ కాపీ (సీసీ) ఇతర నకళ్ల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఉచితంగా పొందే అవకాశం కల్పించింది.
ఇంట్లో నుంచే ఈసీ, సీసీ ఇతర నకళ్లను ఆన్‌లైన్‌లో ఉచితంగా పొందొచ్చు. వివరాలు పొందుపరిస్తే ఈసీ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తారు. ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించడం వల్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగులకు సమయం కలిసి రావడంతో పాటు ఇటు ప్రజలకు అదనపు బాదుడు బెడద తప్పుతోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానానికి ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటు పడుతున్నారు. మొదట్లో తక్కువగా దరఖాస్తులు వచ్చినా ఇప్పుడవి వేల సంఖ్యకు చేరాయి. తనఖా పత్రాలు, దస్తావేజులు, అమ్మకం, వీలునామా, గిఫ్ట్‌ డీడ్లకు సంబంధించిన నకళ్లనూ ఇదే తరహాలో తీసుకోవచ్చు.డాక్యుమెంటు నంబరు కొడితే వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. కొందరికి ఆన్‌లైన్‌పై అవగాహన లేక వీటి జోలికి వెళ్లడంలేదు. మరికొందరికి అవగాహన ఉన్నా చొరవ చూపడంలేదు.
Tags:Corruption is Corruption (East Godavari)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *