ప్ర‌త్యేక కోర్టుల ప‌రిధిలోకి అవినీతి 

Date:15/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

అధికారుల అవితీని విషయంలో కేంద్రం నిశిత దృష్టి పెట్టిందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానమే వస్తుంది. సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఏర్పాటైనన అమికస్ క్యూరీ పరిధిలోకి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎఎస్, ఐపీఎస్ తదితర అఖిల భారత సర్వీస్ అధికారులను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని వినవస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనం.
రాజకీయ నేతలకు వత్తాలు పలకడం పలికే బ్యూరోక్రాట్లను చట్టం ముందు నిలబెడితేనే వ్యవస్థ ప్రక్షాళన అవుతుందన్న భావన ఎప్పటి నుంచో ఉన్నదే. రాజకీయ నాయకుల అవినీతికి వత్తాసు పలికడం, అవినీతి సొమ్మును వెనకేసుకోవడం ద్వారా కోట్లకు పడగలెత్తుతున్న బ్యూరోకాట్లు…చట్టాలలోని లొసుగులు ఆధారంగా ఎటువంటి శిక్ష లేకుండా బయటపడగలుగుతున్నారు.
రాజకీయ నాయకులు- అధికారులు కుమ్మక్కవ్వడం వల్ల వ్యవస్థకు జరిగే నష్టం అంతా ఇంతాకాదు.

 

జన సామాన్యానికి చట్టాలపై, వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లడానికి కూడా ఇటువంటి నెక్సస్ కారణం. అవినీతి రాజకీయ వేత్తలు అధికారుల వత్తాసుతో చట్టం కళ్లుకప్పగలిగినా…ప్రజాక్షేత్రంలో…అంటే ప్రజాకోర్టు…ఎన్నికలలో జనమే వారికి ఓటుతో శిక్ష విధిస్తారు. అదే బ్యూరోకాట్ల విషయానికి వస్తు…వారిపై ఎటువంటి చర్యలూ ఉండటం లేదన్నది వాస్తవం.కొందరు అవినీతి బాబుల అక్రమ సంపాదన అంతులేకుండా ఉంటోంది. సాధారణంగా బ్యూరోక్రాట్లు తమ అక్రమ సంపాదనను రకరకాల రంగాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. అందుకే అవినీతి అధికారులపై ఏసీసీ నమోదు చేసే కేసులను అమికస్ క్యూరీ (ప్రత్యేక కోర్టుల) పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరముందని కేంద్రం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయ అవినీతితో పాటు, అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయగలిగినప్పుడే వ్యవస్థ ప్రక్షాళనకు వీలవుతుందని సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే ఎప్పటి నుంచో చెబుతున్నారు.

ఆయన చేపట్టిన అవినీతి వ్యతిరేకోద్యమ ప్రధాన డిమాండ్ కూడా ఇదే. ఎవరూ కూడా లోకాయుక్త పరిధికి అవతల ఉండకూడదన్నది అన్నా హజారే డిమాండ్.  ఇప్పుడు   అవినీతికి అంతానికి  కేంద్రం కట్టుబడి ఉందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రజకీయ అవినీతితో పాటు అధికారుల అవినీతినీ అమికస్ క్యూరీ పరిథిలోకి తీసుకువచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నారు.

 

బుల్లెట్ ట్రైన్ రేసులో హైద్రాబాద్.,..

Tags:Corruption within the jurisdiction of special courts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *