అమల్లోకి రాని కాస్ట్ కటింగ్స్

Date:11/10/2018
అమరావతి  ముచ్చట్లు:
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు అధికారులు మరోసారి తేల్చి చెప్పారు. ఆదాయం తగ్గుతోందని, ఖర్చులు పెరుగుతున్నాయి.ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి, వృథా ఖర్చులు తగ్గిరచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.కాస్ట్ కటింగ్స్ చేయాలని ఆదేశాలు ఉన్నా..ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు.  క్యాబినెట్‌ స్థాయి ఉన్న వారికి, స్పెషల్‌ సిఎస్‌, డిజిపి స్థాయి వారికి మాత్రమే ఎగ్జిక్యూటివ్‌ తరగతి విమాన ప్రయాణానికి అనుమతించాలని, మిగిలిన వారు ఎకానమీ తరగతిలోనే ప్రయాణిరచాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో వైద్య ఖర్చుల బిల్లులు పెరిగిపోతున్నాయని, వాటిని గుర్తిరచి పున:సమీక్షిరచాలని సిఎస్‌ ఆదేశించారు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రయత్నించాలని సిఎస్‌ అధికారులను ఆదేశించారు.
అనుకున్న దానికన్నా ఆదాయం తక్కువగా వస్తోందని, ఖర్చులు మాత్రం లక్ష్యాన్ని మించి అవుతున్నాయి. తొలి రెండు త్రైమాసికాల్లో ఆదాయం కన్నా ఖర్చులు దాదాపు రెట్టింపు ఉంది. రానున్న చివరి రెండు త్రైమాసికాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. గత ఏడాది చేయాల్సిన ఖర్చుల్లో రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టలేదని, ఆ ఖర్చూ ఈ ఏడాది చేయాల్సిన పరిస్థితి రావడం మరిరత ఇబ్బందికరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో సిఎస్‌ రావు అధ్యక్షతన ఉన్న ద్రవ్య నియంత్రణ కమిటీ ప్రస్తుతం లేదని, ఆర్థిక నిపుణులతో మళ్లీ కొత్త కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉరదని అధికారులు సిఎస్‌కు వివరించారు.
ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసులకు నిర్దిష్ట కాలపరిమితి విధిరచి, కమిటీకి బాధ్యత అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయిరచారు. వివిధ శాఖల్లో ఖర్చులు పెరగిపోతున్నాయని గుర్తించారు. అందువల్ల అవసరం లేని, చిన్న చిన్న శాఖలకు కలిపి పెద్ద శాఖలుగా ఏర్పాటు చేసేందుకు కూడా ఈ కమిటీ సూచనలు ఇవ్వాలని నిర్దేశించారు. వివిధ శాఖల్లోని ఔట్‌ సోర్సిరగ్‌ ఉద్యోగులు వాస్తవ పోస్టులకు అనుగుణంగా పనిచేస్తున్నారా లేదా అన్నది కూడా నిర్ధారణ చేయాల్సి ఉంటుందని, శాఖాపరంగా వినియోగిస్తున్న అద్దె వాహనాల వివరాలు సేకరించాలని నిర్ణయిరచారు.
విదేశీ ప్రయాణాలకు చెల్లించే ప్రయాణ భత్యం, ఇతర ఖర్చులను వారి జీతం ఆధారంగా, నిర్దిష్ట పద్దుల నుంచి మాత్రమే చెల్లించాలని నిర్ణయించారు.. ప్రకటన ఖర్చులపైనా దృష్టి సారిరచాలని, ఈ ఖర్చులపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించడంతోపాటు, అవసరమైతే విజిలెన్స్‌ కమిషన్‌కు రిఫర్‌ చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను ఆన్వేషించాలని సూచించారు.
Tags:Cost cutting does not come into effect

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *