రూ.2 కోట్ల 23 లక్షల పనులకు కౌన్సిల్‌ ఆమోదం

ఎమ్మిగనూరు  ముచ్చట్లు :
స్థానిక మున్సిపల్‌ సాధారణ సమావేశంలో పలు  అభివృద్ధి పనులకు మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.    చైర్మన్‌ డా.రఘు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో పలు వార్డు సమస్యలపై ఆయా  కౌన్సిలర్లు అడుగగా సంబంధిత అధికారులు త్వరలోనే సమస్యలను పరిష్కారిస్తామని తెలిపారు.వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ 18 సం. వయసుపైబడిన వారికి వ్యాక్సినేషన్ వేయాలని కోరగా కమిషనర్ కృష్ణ త్వరలోనే వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతామని అన్నారు.అనంతరం 16 అంశాలకు సంబంధించి ఎజెండా రూపొందించగా ప్రధానంగా పట్టణ ప్రగతి నిధుల నుంచి రూ.2కోట్ల 23 లక్షల విలువగల పనులు చేపట్టనున్నారు.ఇందులో 1,5,12,
14,17,18,22,23,25,27,28,31 వార్డులు ఉన్నాయి.గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 20 దుకాణాలకు గాను 17 దుకాణాల  అధిక వేలం పాడిన వారికి కేటాయించేందకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. J-9A, E-3, E-11(P.H) మొత్తం 3 దుకాణాలకు వేలంపాటలో ఎవరు పాల్గొననందున వాయిదా వేశారు. కౌన్సిలర్‌లు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో కమిషనర్‌ కృష్ణ, డి.ఈ వెంకటేశ్వర్లు,రెవెన్యూ అధికారి మంజునాథ్, అసి స్టెంట్‌ ఇంజనీర్‌ ఓబులేషు,హోసింగ్ ఏ.ఈ ప్రసాద్ తోపాటు టెక్నికల్‌ అధికారులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల గృహనిర్మాణ పథకంపై దృష్టిపెట్టింది. వీలైనంత త్వరగా ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో వేగంగా ఇళ్ళ నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై సమగ్ర విషయాలను హౌసింగ్ ఏ.ఈ ప్రసాద్ తెలిపారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Council approves works worth Rs 2 crore 23 lakh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *