కౌన్సిలర్‌ అమ్మును దేశంలో చేర్చుకోరాదు

– బిజెపి ఉపాధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌

 

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అమ్ము ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోరాదని బిజెపి రాజంపేట పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ సూచించారు. గురువారం బిజెపి నేతలు రాజాజెట్టి, మఠంబాబుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని గాడిదగా విమర్శించిన కౌన్సిలర్‌ అమ్ముకు మతిబ్రమించిందని తెలిపారు. అమ్ముకు రాజకీయ పరిజ్ఞానం, సిగ్గు…ఎగ్గులేని వ్యక్తి అని విమర్శించారు. స్వార్థం కోసం పార్టీలు మార్చుతున్న కౌన్సిలర్‌ అమ్ము లాంటి వారితో గౌరవ కోల్పోతామని , ఆయన రాజకీయ వ్యబిచారం చేస్తున్నాడని అయూబ్‌ఖాన్‌ మండిపడ్డారు. అతనిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోరాదని సూచించారు.

 

Tags:Councilor Ammu should not be included in the country

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *