గుడివాడ ముచ్చట్లు:
గుడివాడ సీఐ కిషోర్ బాబు రానున్న సంక్రాంతి పండగ సందర్భంగా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఎవరైనా పాలుపెడితే సహించేది లేదని అట్టువారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కిషోర్ బాబు హెచ్చరించారు. ఈరోజు సర్కిల్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లందరును సర్కిల్ ఆఫీస్ కి పిలిపించి వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు రానున్న రోజుల్లో సంక్రాంతి పండగ నిమిత్తం కోడి పందాలు,పేకాట, చిత్తులాట అలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఎవరైనా పాలు పడితే వారిని గుర్తించి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కిషోర్ బాబుకు సమాచారం అందించాలి అని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిఐ కిషోర్ బాబు కోరారు.సమాచారం ఈ ఫోన్ 9440627046 నెంబర్ కి అందచేయాలి అని సీఐ కిషోర్ బాబు తెలిపారు.
Tags: Counseling for bullies