10 వ తేదీ నుండి టిటిడి కళాశాలల్లో  కౌన్సిలింగ్ 

Date:07/06/201 9

తిరుపతి ముచ్చట్లు:

టిటిడిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో 2019-20వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్ధిని విద్యార్ధులకు జూన్ 10వ తేదీ నుండి కౌన్స్లింగ్

ప్రారంభం కానుంది.   శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పిడబ్ల్యు డిగ్రీ కళాశాలలో  జూన్ 10వ తేదీ నుండి ఆయా కళాశాలల ప్రాంగణాలలో కౌన్సిలింగ్

నిర్వహించనున్నారు. అదేవిధంగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో ప్రవేశాలకు జూన్ 14వ తేదీ శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో కౌన్సిలింగ్ జరుగనుంది. ఆయా

కేటాగిరి విద్యార్థులు ఆయా తేదీలలో కౌన్సిలింగ్కు హాజరుకావలసిన విషయాన్ని ప్రతి విద్యార్థి మొబైల్ నంబరు కు ఎస్ఎమ్ఎస్ మరియు ఈ- మెయిల్ పంపడం జరిగింది. కౌన్సిలింగ్ షెడ్యూల్ను

అడ్మిన్ వెబ్సైట్ యందు షెడ్యుల్ బాక్స్ లో  పొందు పరచడమైనది. కావున విద్యార్థిని విద్యార్థులు వారి ఈ-మెయిల్ నందు కానీ లేదా అడ్మిన్ వెబ్ సైట్ యందు విద్యార్థులు ప్రాస్పెక్టస్ లో తెలిపిన

విధంగా ఒరిజినల్ టిసిని, అన్ని ధృవీకరణ పత్రాలను మరియు నిర్ణిత రుసుంతో కౌన్సిలింగ్కు హాజరు కావాలి. కౌన్సిలింగ్ షెడ్యూల్ జాగ్రత్తగా పరిశీలించి వారికి కేటాయించిన తేదీలలో కౌన్సిలింగ్

కేంద్రాలకు హాజరుకావాలి.  ఆయా తేదీలలో కౌన్సిలింగ్ కు హాజరుకాని విద్యార్థులు, అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించనివారు, నిర్ణిత రుసుం చెల్లించని వారికి ప్రవేశం కల్పించడం జరుగదని

ప్రకటనలో పేర్కోన్నారు.

 

సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్

Tags:Counseling in TTD colleges since 10th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *