Natyam ad

విద్యార్దులకు మాదక ద్రవ్యాలపై కౌన్సిలింగ్

విజయవాడ ముచ్చట్లు:
 
భవాని పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని  చైతన్య కాలేజీలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల పై  భవానిపురం  సీ.ఐ మురళి కృష్ణ ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సీఐ మీడియాతో మాట్లాడుతూ  తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాశాలలో కౌన్సిలింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశామని ప్రస్తుత యువత ఎవరైతే కాలేజీ లో చెడు స్నేహాల వలన చదువు ను నిర్లక్ష్యం చేసి మత్తుపానీయాలు, ,మాదక ద్రవ్యాలు,  బైక్ రేసింగ్ లాంటి అలవాట్లను  తెలిసీ తెలియని వయసులో,కాలేజీ చదువుల సమయంలోనే చెడు స్నేహాల వలన ఈ బాట పడుతున్నారని  మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాల  బారిన పడి ఏ విద్యార్థి కూడా తమ  జీవితాలను నాశనం చేసుకోకూడదని,   సత్ప్రవర్తన కలిగి అటు  తల్లిదండ్రులకు సమాజానికి మేలు చేసే విధంగా విద్యార్థుల యొక్క చదువులు ఉండాలని,   తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి ఆశలు వమ్ము చేయకుండా  కష్టపడి చదివి మంచి ప్రయోజకులు కావాలనే ఈ కౌన్సిలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని  సిఐ మురళీకృష్ణ తెలిపారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Counseling on drugs for students