నకిలీ బంగారం అంటకట్టే ముఠా ఆరెస్టు

అనంతపురం ముచ్చట్లు:
 
వ్యసనాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణ  రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విజయ్ కుమార్, అశోక్, దివాకర్ సామాన్య ప్రజలకు ఆశ చూపడం మొదలుపెట్టారు. పొలం, పాత ఇల్లు పడగొడుతున్న సమయంలోనూ, కొన్ని ప్రాంతాల్లో గోతులు తవ్వుతుండగా బంగారు నాణ్యాలు దొరికాయని తక్కువ ధరకు ఇస్తామని సామాన్య ప్రజలకు ఆసక్తి చూపుతారు. కొత్త నెంబర్లకు ఫోన్ చేసి ఈ విషయాలను చెబుతారు. మొదట నిజమైన బంగారు నాణేలు చూపి డబ్బులు తీసుకునే సమయంలో నకిలీ బంగారు నాణేలు అందజేస్తారు. వాటిని సామాన్య ప్రజలు పరీక్షించుకునే లేపే అక్కడినుంచి పరారవుతారు. అనంతపురం రూరల్ పరిధి సమీపంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన పరమేశు, మహేష్ లకు ఫోన్ లో నమ్మబలికారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు  రూరల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. పక్కా  సమాచారంతో అనంతపురం శివారు సి ఆర్ ఐ టీ కళాశాల దగ్గర నిందితులను పట్టుకున్నామన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags:Counterfeit gold smuggling gang arrested